అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థి మృతి

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్‌(12) మంగళవారం రాత్రి మృతిచెందాడు.

Published : 17 Apr 2024 03:55 IST

ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ వేటు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్‌(12) మంగళవారం రాత్రి మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లిక్‌పల్లికి చెందిన మహేశ్‌ కుమారుడు ప్రశాంత్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12న కలుషిత ఆహారం వల్ల సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రశాంత్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 13న హైదరాబాద్‌ తరలించారు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. అస్వస్థతకు గురైన వారిలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు, ఉస్మానియాలో ఇద్దరు, భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఘటనకు బాధ్యుడిగా ప్రిన్సిపల్‌ శ్రీరాముల శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ గురుకులాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వైస్‌ ప్రిన్సిపల్‌ రాముకు బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని