కబడ్డీ నేర్పిస్తామని నమ్మించి ఎస్సీ బాలికపై అత్యాచారం

కబడ్డీ ఆటలో మెలకువలు చెబుతామంటే నమ్మి వారి వద్దకు వెళ్లిన ఓ ఎస్సీ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 17 Apr 2024 05:58 IST

ముగ్గురిపై పోక్సో కేసు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: కబడ్డీ ఆటలో మెలకువలు చెబుతామంటే నమ్మి వారి వద్దకు వెళ్లిన ఓ ఎస్సీ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన ప్రకారం.. ఇటీవలే పదో తరగతి పూర్తిచేసిన ఓ బాలిక (16) రోజూ స్థానికంగా ఓ మైదానానికి వెళ్లి కబడ్డీ ప్రాక్టీస్‌ చేసేవారు. అదే మైదానానికి వచ్చే ప్రైవేటు శిక్షకుడు టి.పవన్‌కుమర్‌, క్రీడాకారులు సీహెచ్‌.డోగేంద్ర మహావిష్ణు, పి.కొండలరావు.. తాము ఉంటున్న చోటికి వస్తే కబడ్డీలో మరిన్ని మెలకువలు నేర్పిస్తామని బాలికను నమ్మించారు. వారితో ఉన్న పరిచయం కారణంగా ఈ నెల 7న వారి గదికి వెళ్లిన బాలికను ముగ్గురూ అత్యాచారం చేసి వీడియో తీశారు. దాని ఆధారంగా బెదిరించి 8, 9 తేదీల్లో కూడా వారి గదికి రప్పించుకున్నారు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న బాలికను తల్లి ప్రశ్నించడంతో మంగళవారం ఈ విషయం బయటపడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని