సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి

వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది.

Updated : 17 Apr 2024 07:32 IST

చింతలపూడి, న్యూస్‌టుడే: వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. ఇటీవల జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన గౌడ సామాజికవర్గం సమావేశానికి రాలేదన్న కారణంతో స్థానిక వైకాపా సానుభూతిపరులు సుమారు 15 మంది సోమవారం రాత్రి తన ఇంటి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారని బాధితుడు, తెదేపా కార్యకర్త కొనకళ్ల చెన్నారావు తెలిపారు. ఆక్రమించి ఇంటి ప్రహరీ నిర్మించావంటూ పలుగుతో దాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని వాపోయారు. ప్రహరీ కొంత మేర ధ్వంసమైంది. ఈ సంఘటనపై చెన్నారావు మంగళవారం ఉదయం చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని