అనంత్‌నాగ్‌లో బిహార్‌ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్‌నాగ్‌ జిల్లాలో బిహార్‌కు చెందిన కూలీని కాల్చి చంపారు.

Published : 18 Apr 2024 03:34 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్‌నాగ్‌ జిల్లాలో బిహార్‌కు చెందిన కూలీని కాల్చి చంపారు. బిహార్‌కు చెందిన రాజా షా కణత భాగానికి ఉగ్రవాదులు తుపాకీ గురిపెట్టి కాల్చారని, అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు వెల్లడించారు.

పూంఛ్‌ జిల్లాలో మూడు ఐఈడీల స్వాధీనం

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లో పేలుళ్లకు పాల్పడాలన్న ఉగ్రవాదుల ప్రణాళికలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ మేరకు పూంఛ్‌ జిల్లాలో సరిహద్దుకు సమీపంలో ఉగ్రవాదుల రహస్య స్థావరం నుంచి మూడు పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని