గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

గుజరాత్‌లో ఆగివున్న చమురు ట్యాంకర్‌ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు.

Published : 18 Apr 2024 03:35 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఆగివున్న చమురు ట్యాంకర్‌ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. వడోదర నుంచి అహ్మదాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఖేదా జిల్లాలోని నడియాద్‌ వద్ద అహ్మదాబాద్‌- వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన నిలిపిఉన్న ట్యాంకర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో గుజరాత్‌లోని వివిధ నగరాలకు చెందిన వారు ఉన్నారని, ఇప్పటి వరకు నలుగురిని మాత్రమే గుర్తించామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని