తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం

జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 18 Apr 2024 03:35 IST

కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సమీపంలోని అత్తాపూర్‌లో ఓ మందుల దుకాణంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన క్యాన్‌డూర్‌ ఫార్మాసూటికల్స్‌ తయారు చేసిన అల్టాకోల్డ్‌ సస్పెన్షన్‌ అనే మందును జ్వరం నయం చేస్తుందని విక్రయిస్తుండగా సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. వ్యాధిని నయం చేస్తుందని కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎలాంటి లైసెన్స్‌లేకుండా అక్రమంగా వైట్‌ పెట్రోలియం జెల్లిని తయారు చేస్తున్న ఓ సంస్థపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని