అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 20 Apr 2024 05:50 IST

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నెత్తెట్ల మల్లయ్య (48) అనే రైతు తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఏడాది క్రితం రూ. 3 లక్షలు అప్పు చేసి భూమిని చదును చేయించారు. యాసంగిలో పంట సాగు కోసం రూ. 1.50 లక్షలను పెట్టుబడిగా పెట్టగా, ఇంటి నిర్మాణానికి మరో రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం రూ. 15 లక్షల వరకు అప్పులు కాగా..వాటిని తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపం చెందిన మల్లయ్య గురువారం రాత్రి తన పొలం సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకొన్నాడు. శుక్రవారం గొర్రెల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మల్లయ్యకు భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్‌, కుమార్తె అమూల్య ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని