సెల్‌ఫోన్‌ పేలి బాలికకు తీవ్రగాయాలు

సెల్‌ఫోన్‌ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది.

Published : 21 Apr 2024 06:01 IST

బెల్లంకొండ, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. శనివారం ఇంట్లో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలో గాయాలయ్యాయి. వెంటనే గుంటూరు వైద్యశాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని