వైకాపా నాయకుడి కారులో మద్యం స్వాధీనం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం గ్రామ వైకాపా నాయకుడు మారు సుధాకర్‌రెడ్డి కారులో ఏడు బస్తాల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 21 Apr 2024 05:03 IST

ముత్తుకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం గ్రామ వైకాపా నాయకుడు మారు సుధాకర్‌రెడ్డి కారులో ఏడు బస్తాల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4,240 మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. వారు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం మేరకు 20 బస్తాల్లో ఉన్న మద్యాన్ని మూడు కార్లలో తరలించేందుకు నాయకులు ప్రయత్నించారు. అధికారులు కార్లను వెంబడించారు. సుధాకర్‌రెడ్డికి చెందిన కారులో ఏడు బస్తాల్లో మద్యాన్ని గుర్తించారు. మిగిలిన 13 బస్తాల మద్యం సదరు నాయకుడి బంధువులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద డంప్‌ చేసినట్లు తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లను సీజ్‌ చేశారు. సుధాకర్‌రెడ్డితోపాటు డ్రైవర్‌ వెంకటరమణ, రాము, నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు