చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.

Updated : 22 Apr 2024 04:53 IST

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపాలెంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పామంజి శ్రీరాములు స్థానికులతో కలిసి చంద్రబాబు సభకు వెళ్లి తిరిగి అర్ధరాత్రి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో వైకాపా కార్యకర్త ఈశ్వరయ్య మరో నలుగురు వ్యక్తులతో కలిసి గొడవకు దిగాడు. ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శ్రీరాములుకు తీవ్రంగా గాయాలవడంతో నెల్లూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని