వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

Updated : 22 Apr 2024 04:51 IST

కావలి, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. సీ విజిల్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణంలోని 15వ వార్డు సచివాలయం తనిఖీ చేయడానికి అధికారులు ఆదివారం వెళ్లారు. సెలవు రోజు కావడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి మెంతెం శ్రీనివాసులురెడ్డి సమక్షంలో పోలీసులు తలుపులు పగులగొట్టి పరిశీలించగా.. గోనె సంచిలోని 43 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడే మరో గదిలో రేషన్‌ బియ్యం బస్తాలూ కనిపించాయి. ఆ బియ్యం బస్తాలు తనవని, వాటిని పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందని స్థానిక వైకాపా నాయకుడైన రేషన్‌ షాపు డీలరు నంబూరి వెంకటేశ్వర్లురెడ్డి అధికారులకు వివరణ ఇచ్చారు. మద్యం బాటిళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టినట్లు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని