ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా కేస్కుతుల్‌-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు.

Published : 22 Apr 2024 04:47 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా కేస్కుతుల్‌-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. భైరాంగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కమాండర్‌ కవాసి పండారు నాయకత్వంలో దాదాపు 20 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నిఘావర్గాల సమాచారంతో డీఆర్జీ జవాన్‌లు కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 5.30 గంటల సమయంలో డీఆర్జీ జవాన్‌లను పసిగట్టిన మావోయిస్టులు  కాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు జనతన సర్కార్‌ భైరాంగఢ్‌ అధ్యక్షుడు గుడ్డి కవాసి(34) తూటాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. గుడ్డి కవాసీపై రూ.లక్ష రివార్డు ఉందని బీజాపుర్‌ ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ, కుక్కర్‌ బాంబు, విప్లవ సాహిత్యం, కిట్‌ బ్యాగులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని