ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్‌లో 9 మంది మృతి

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్‌లోని ఝలావాఢ్‌లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది.

Updated : 22 Apr 2024 06:06 IST

కోటా: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్‌లోని ఝలావాఢ్‌లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్‌లోని డుంగ్రి గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా బాధితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున ఝలావాఢ్‌లో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సోదరులు సహా తొమ్మిది మందీ 16-30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పురుషులేనని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని