పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు

పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.

Published : 23 Apr 2024 03:46 IST

బెల్లంకొండ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తరఫున ఆయన సోదరి రుద్రమ్మదేవి ఆదివారం సాయంత్రం నాగిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా కార్యకర్తలు, నాయకులు ఆమె నిర్వహించిన ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుగా ఉంచి తెదేపా శ్రేణులను నిలువరించారు. దీంతో తెదేపా నాయకులు ప్రశ్నించగా వారిపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకుని తెదేపా శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు. స్థానికులు గమనించి తెదేపా నాయకులకు సమాచారం అందించేలోపే అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనపై తెదేపానాయకులు ఎస్సై రాజేష్‌కు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని