సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు

మహబూబాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమ మహ్మద్‌ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు.

Updated : 23 Apr 2024 09:18 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమ మహ్మద్‌ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో.. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆమె ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు అనిశా వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2.94 కోట్లు, మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఉంటుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని