పంట నష్టాలతో రైతు ఆత్మహత్య

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్‌ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 23 Apr 2024 03:53 IST

మరిపెడ, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్‌ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం చీనా తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మిరప, పత్తి పంటలు సాగు చేశారు. పంట ధరలు తగ్గడం, వర్షాభావంతో దిగుబడి రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పొలం వద్ద పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని