చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం

ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 23 Apr 2024 06:46 IST

చంద్రుగొండ, న్యూస్‌టుడే: ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాచినేని రవి కథనం ప్రకారం.. మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి(23) ఇటీవల బీఎస్సీ పూర్తిచేసింది. అనంతరం ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. తల్లి.. తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గతనెల 28న వివాహం జరిగింది. పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చిన దేవకి ఈ నెల 14న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి, అనంతరం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమెకు ఇంజినీరింగ్‌ చదివిన సోదరుడు కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని