ఏపీలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Updated : 23 Apr 2024 06:20 IST

రూ.2.50 లక్షల నగదు స్వాధీనం

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని పట్టణ శివారు ఎమ్మిగనూరు రహదారి సమీపంలోని కొండల్లో వైకాపా నాయకుడు మహానందితో పాటు మరికొందరు కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామన్నారు. మహానంది కుమారుడు బోయ రమేశ్‌, ఎమ్మిగనూరుకు చెందిన షహీద్‌, కార్వన్‌పేటకు చెందిన బెస్త వినోద్‌ను అరెస్టు చేసి వారినుంచి రూ.2.50లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహానంది నాలుగేళ్లుగా ఆయన కుమారుడుతో కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. కాగా గతేడాదీ మహానంది క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి రూ.80లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని