యూసఫ్‌గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!

యూసఫ్‌గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 23 Apr 2024 11:30 IST

హైదరాబాద్‌: నగరంలోని యూసఫ్‌గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే ‘నాని కార్స్‌’లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని