నూడుల్స్‌ ప్యాకెట్లలో వజ్రాలు

నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ విభాగం స్వాధీనం చేసుకుంది.

Published : 24 Apr 2024 06:49 IST

లోదుస్తులు, మలద్వారంలో బంగారం
ముంబయి విమానాశ్రయంలో రూ.6.46 కోట్ల సొత్తు స్వాధీనం

ముంబయి: నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ సొత్తు విలువ రూ.6.46 కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు గత వారాంతంలో రూ.4.44 కోట్ల విలువైన 6.815 కేజీల బంగారం, రూ.2.02 కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని, నలుగరు ప్రయాణికులను అరెస్టు చేశామని సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబయి నుంచి బ్యాంకాక్‌ వెళుతున్న ఓ భారతీయుడి బ్యాగేజీలోని నూడ్సుల్స్‌ ప్యాకెట్లలో వజ్రాలను గుర్తించామని, అనంతరం ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశామని అందులో పేర్కొన్నారు. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ముంబయి వచ్చిన ఓ విదేశీ మహిళ తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచి పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఆమె దగ్గర నుంచి 321 గ్రాముల బరువైన బంగారాన్ని (కడ్డీలు, చిన్నచిన్న ముక్కలు) స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌, అబుధాబి, బహ్రెయిన్‌, దోహా, రియాద్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌, మస్కట్‌ దేశాల నుంచి వచ్చిన భారతీయులను తనిఖీ చేయగా రూ.4.04 కోట్ల విలువైన 6.199 కేజీల బంగారాన్ని గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. వీరు ఈ బంగారాన్ని మలద్వారం, ఇతర శరీర భాగాలు, బ్యాగేజీలో పెట్టి తరలిస్తుండగా గుర్తించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని