అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది.

Published : 24 Apr 2024 05:03 IST

చికిత్స పొందుతూ భర్త మృతి

ముత్తారం, న్యూస్‌టుడే: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుసాల మధుసూదన్‌(43), ఆయన భార్య సంధ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. పంట నష్టాలు, ఇతర అప్పులు కలిపి రూ.10 లక్షలకు పెరిగాయి. అవి తీర్చే మార్గం లేక ఈ నెల 14న దంపతులిద్దరూ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సంధ్య తన కుమారునికి సెల్‌ఫోన్‌ ద్వారా తెలపడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వచ్చి వారిద్దరినీ చికిత్స నిమిత్తం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంధ్య కోలుకోగా.. అక్కడే చికిత్స పొందుతున్న మధుసూదన్‌ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుని కుమారుడు ఆకాశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని