ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు

ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

Published : 24 Apr 2024 05:04 IST

మునగాల, న్యూస్‌టుడే: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జీడిమెట్ల నుంచి సుమారు 30మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు యానాంకు బయలుదేరింది. మార్గమధ్యంలో మునగాల ప్రభుత్వ వైద్యశాల వద్ద అదుపు తప్పి డివైడర్‌ మీదుగా సర్వీస్‌ రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులోని నలుగురు క్షతగాత్రులను సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని