మంత్రి కాకాణి అనుచరుడి రైస్‌ మిల్లులో మద్యం స్వాధీనం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్‌రెడ్డి రైస్‌మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్‌, పోలీసు అధికారులు సీజ్‌ చేశారు.

Updated : 25 Apr 2024 07:17 IST

పొదలకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్‌రెడ్డి రైస్‌మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్‌, పోలీసు అధికారులు సీజ్‌ చేశారు. 54 బాక్సుల్లో ఉన్న 2069 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4.05 లక్షలు ఉంటుందన్నారు. సెబ్‌ సీఐ వెంకట్రావు కేసు నమోదు చేసి మద్యం సీసాలను పొదలకూరు సెబ్‌ కార్యాలయానికి తరలించారు. రైస్‌ మిల్లు యజమాని సహాయకుడు పసుపులేటి పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మంత్రి కాకాణి అనుచరులు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల భారీగా మద్యం నిల్వ చేశారని అయిదు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని