పని ఒత్తిడి, విజిలెన్స్‌ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఇంజినీరు(డీవైఎస్‌ఈ)గా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Updated : 18 May 2024 04:49 IST


కిరీటి 

జైపూర్, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఇంజినీరు(డీవైఎస్‌ఈ)గా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం విధులకు హాజరై మధ్యాహ్నం తన క్వార్టర్‌లోకి వెళ్లారు. తిరిగి రాకపోవడంతో తోటి సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు గమనించారు. కిరీటికి భార్య శ్రుతి, రెండేళ్ల బాబు ఉన్నారు. తమ కుమారుడి మృతికి ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడే కారణమని తండ్రి రఘురామచారి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్‌ తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓఅండ్‌ఎం విభాగానికి సంబంధించి జరుగుతున్న విజిలెన్స్‌ విచారణతో ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. కొందరు అధికారుల పేర్లు రాసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని