ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి

కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు.

Updated : 18 May 2024 04:51 IST

చెన్నై, న్యూస్‌టుడే: కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కుట్రాలం జలపాతం సందర్శనకు శుక్రవారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. తిరునెల్వేలికి చెందిన అశ్విన్‌(17) జలపాతం వద్ద ఉండగా ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఆ ఉద్ధృతికి అశ్విన్‌ కొట్టుకుపోయాడు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు. తమిళనాడులో దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల ఉన్నట్టుండి ఆకస్మికంగా వరద పెరిగిందని అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా కుట్రాలం జలపాత సందర్శనను అధికారులు నిలిపేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని