గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు

సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్‌లో చేర్చినట్లు ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 18 May 2024 05:53 IST

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్‌లో చేర్చినట్లు ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది మహిళలను ఎరగా చూపి హనీట్రాప్‌ విధానంలో విశాఖ కేంద్రంగా భారత నౌకాదళానికి చెందిన ఉద్యోగులను కొందరు లోబర్చుకున్నారు. వారి ద్వారా ఇక్కడి సైనిక స్థావరాల వివరాలు తెలుసుకుని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణల మేరకు పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ముంబయికి చెందిన ఆమన్‌ సలీం షేక్‌ పాత్ర కూడా ఉందని అధికారులు గుర్తించారు. అతను పాకిస్థాన్‌ ఏజెంట్లు అయిన ఉస్మాన్, మీర్‌బలాజ్‌ఖాన్, అల్వెన్‌ తదితరుల నుంచి నగదు పొందేవాడు. దీంతో ఈ కేసులో అతన్ని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ విశాఖలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని