బస్సులో 9 మంది సజీవ దహనం

హరియాణాలోని నూహ్‌ జిల్లా ధులావత్‌ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్‌- పల్వాల్‌(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి.

Published : 19 May 2024 06:02 IST

హరియాణాలో దుర్ఘటన 

గురుగ్రామ్‌: హరియాణాలోని నూహ్‌ జిల్లా ధులావత్‌ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్‌- పల్వాల్‌(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారని, 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బస్సులో పంజాబ్‌లోని హోశియార్‌పుర్, లుథియానాకు చెందిన దాదాపు 60 మంది ఉన్నారు. వీరంతా బంధువులు కాగా.. మథుర, బృందావన్‌ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వెళుతున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని సదర్‌ తావురు పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో జితేంద్రకుమార్‌ తెలిపారు. బస్సులోని ఏసీ బాక్స్‌లో షార్ట్‌సర్యూట్‌ సంభవించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. నిపుణులు పరిశీలించిన తర్వాతే ఈ విషయమై స్పష్టత రానుంది. గాయపడిన 17 మందిలో 14 మందిని ఆసుపత్రి నుంచి పంపించేశారని, ముగ్గురు మహిళలు మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారని ఓ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు