పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం

వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో  పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు.

Published : 20 May 2024 05:04 IST

న్యూస్‌టుడే- తాండూరు, యాలాల: వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో  పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. జుంటుపల్లికి చెందిన మంగలి శ్రీనివాస్‌ (30), కొనింటి లక్ష్మప్ప (45) పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. వరి పంట కోతకు వీరు ఆదివారం యంత్రాన్ని తెప్పించారు. కోత ప్రారంభానికి ముందు ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో.. యంత్రం కిందకు వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో అక్కడ పిడుగు పడడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మిషన్‌ డ్రైవర్‌ తుకారాం స్పృహ కోల్పోవడంతో తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బెన్నూరులో గొల్ల వెంకప్ప (60) పొలంలో ఎరువు చల్లుతుండగా.. పిడుగుపాటుకు గురై అక్కడే మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని