విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం

ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.

Published : 20 May 2024 04:56 IST

గంపలగూడెం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు. గ్రామంలోని పడమర ఎస్సీవాడకు చెందిన గోరంట్ల తిరుపయ్య(62), జమలమ్మ(50) రేకుల ఇంట్లో నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో గాలులతో కూడిన జల్లులు కురిశాయి. ఆ సమయంలో సర్వీసు తీగ నుంచి రేకులకు విద్యుత్తు ప్రసరణ జరిగి ప్రమాదవశాత్తు వారికి తగలడంతో మృతి చెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కూలి పనులు చేసుకొని జీవించే వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని