గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లిన దుండగులు

ఝార్ఖండ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు.

Updated : 20 May 2024 06:05 IST

ఝార్ఖండ్‌లో అమానుష ఘటన

గఢ్‌వా: ఝార్ఖండ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. గఢ్‌వా జిల్లాలోని అమ్‌రోరా గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సరస్వతి రామ్‌ అనే వ్యక్తి తన ఆవుతో బంశీధర్‌నగర్‌ ఉంటారికి వెళుతుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన రాహుల్‌ దూబె, రాజేష్‌ దూబె, కాశీనాథ్‌ భుయాన్‌ అనే వ్యక్తులు ఆయన్ను అడ్డగించారు. గోవును అక్రమంగా రవాణా చేస్తున్నాడని అనుమానించి తమ బైక్‌కు అతడిని కట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లి రోడ్డుపై వదిలేశారు. నిందితుల్లో కాశీనాథ్‌ భుయాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు. గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని