ఒడిశాలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఒకరి హత్య

ఒడిశాలోని బరగఢ్‌ జిల్లా సదర్‌ ఠాణా పరిధిలోని సొరొసొరాకు చెందిన ఆటోడ్రైవర్‌ బిశ్వనాథ్‌ (35)ను సోమవారం మధ్యాహ్నం ఒక పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ప్రత్యర్థులు హతమార్చారు.

Updated : 21 May 2024 05:46 IST

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశాలోని బరగఢ్‌ జిల్లా సదర్‌ ఠాణా పరిధిలోని సొరొసొరాకు చెందిన ఆటోడ్రైవర్‌ బిశ్వనాథ్‌ (35)ను సోమవారం మధ్యాహ్నం ఒక పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ప్రత్యర్థులు హతమార్చారు. ఆయన ఓటేసి వెళ్తుండగా కొంతమంది మారణాయుధాలతో దాడిచేసి హత్య చేసి పరారయ్యారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొని కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. ఇది రాజకీయ హత్య కాదని, పాతకక్షలే కారణమని పోలీసులు, ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని