జల్పాయిగుడిలో రామకృష్ణ మిషన్‌ ఆశ్రమంపై దుండగుల దాడి

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లాలోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 21 May 2024 05:13 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లాలోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సాయుధులైన దుండగులు ఆశ్రమంలో ఉన్న సాధువులు, ఉద్యోగులకు తుపాకులు ఎక్కుపెట్టి ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని బెదిరించారని ఆరోపించింది. అనంతరం విధ్వంసానికి పాల్పడ్డారని, సీసీటీవీ కెమేరాలను పగులగొట్టారని, వెళ్తూవెళ్తూ మెయిన్‌ గేటుకు తాళం వేశారని పేర్కొంది. తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపింది. పోలీసులు వచ్చి తాళం బద్దలుకొట్టి సాధువులను, సిబ్బందిని బయటకు తీసుకొచ్చారని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని