నలుగురు ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 21 May 2024 05:13 IST

 భారత్‌లో విధ్వంసానికి పన్నాగం 

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబో నుంచి చెన్నై మీదుగా ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌ చేరుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. వారి సెల్‌ఫోన్‌లోని వివరాల ఆధారంగా ఓ ప్రదేశంలో దాచిన పాకిస్థాన్‌ తయారీ పిస్తోళ్లు, 20 కాటరిజ్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని ఐసిస్‌ నాయకుడు అబూ బాకర్‌ అల్‌ బాగ్దాదీ నేతృత్వంలో పనిచేస్తున్న వీరు.. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహరచన చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరికి పాకిస్థాన్‌ వీసా కూడా ఉందడం గమనార్హం. వారిపై ఉపా తదితర చట్టాల కింద కేసులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని