యూపీలో ఎనిమిది సార్లు ఓటేసిన మైనర్‌ అరెస్ట్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న నాలుగో విడత పోలింగ్‌లో 17 ఏళ్ల యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేశాడు.

Published : 21 May 2024 05:14 IST

ఫరూఖాబాద్, లఖ్‌నవూ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న నాలుగో విడత పోలింగ్‌లో 17 ఏళ్ల యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ బాగోతాన్ని అతడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి.. ప్రజాస్వామ్యాన్ని భాజపా దోచుకోవాలని చూస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్‌ప్రదేశ్‌ సీఈవో స్పందిస్తూ.. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులను సస్పెండ్‌ చేస్తామని, రీపోలింగ్‌కు సిఫార్సు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు