కోటపల్లిలో చిరుతపులి చర్మం స్వాధీనం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద సోమవారం చిరుతపులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 21 May 2024 05:26 IST

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

చెన్నూరు, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద సోమవారం చిరుతపులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపుర్‌ అటవీప్రాంతంలో రెండేళ్ల కిత్రం వర్దల్లి గ్రామానికి చెందిన దుర్గం పవన్‌ చిరుతపులిని హతమార్చి చర్మాన్ని తీసి దాచాడు. లింగపూర్‌ గ్రామానికి చెందిన బాబర్‌ఖాన్‌తో కలిసి మంచిర్యాలలో చర్మాన్ని విక్రయించేందుకు వస్తుండగా కోటపల్లి ఎస్సై రాజేందర్‌ రాపన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్దనుంచి చిరుతపులి చర్మంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం అటవీశాఖ అధికారులకు అప్పజెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని