ప్రాణం తీసిన అతివేగం.. అమెరికాలో కారు బోల్తాపడి ముగ్గురు భారతీయ-అమెరికన్‌ విద్యార్థుల మృతి

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో వేగంగా వెళుతున్న కారు బోల్తా పడడంతో ముగ్గురు భారతీయ-అమెరికన్‌ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 23 May 2024 05:22 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో వేగంగా వెళుతున్న కారు బోల్తా పడడంతో ముగ్గురు భారతీయ-అమెరికన్‌ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 14న అల్ఫారెటాలోని వెస్ట్‌సైడ్‌ పార్క్‌వేలో సంభవించిన ప్రమాదంలో అవసరాల శ్రియ, అన్విశర్మ, ఆర్యన్‌ జోషిలు మృతిచెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు.వాహనంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారని, జోషి, శ్రియలు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శర్మ మృతి చెందినట్లు తెలిపారు. జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ విద్యార్థి రిత్వక్‌ సోంపల్లి, అల్ఫారెట్టా హైస్కూల్‌లో చదివే మొహ్మద్‌ లియాఖత్‌లుగా మిగిలిన ఇద్దరుగా గుర్తించారు. వీరిలో రిత్వక్‌ వాహనం నడుపుతున్నాడని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని