కారులో ఊపిరాడక చిన్నారి మృతి

ఆగి ఉన్న కారులోకి ఆడుకుంటూ వెళ్లి ఎక్కిన ఓ చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 23 May 2024 06:12 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

కలిష

మణుగూరు, న్యూస్‌టుడే: ఆగి ఉన్న కారులోకి ఆడుకుంటూ వెళ్లి ఎక్కిన ఓ చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. సాంబాయిగూడెంకు చెందిన మడకం సాయి, లిఖిత దంపతులకు మూడేళ్ల కుమార్తె కలిష(మింకు), 5 నెలల కుమారుడు సంతానం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కలిష ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. చివరికి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆగి ఉన్న ఓ కారులోకి తొంగిచూడగా చిన్నారి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికే మృతి చెందింది. కారులోకి వెళ్లిన తర్వాత డోర్‌ తీయడం రాక, ఆక్సిజన్‌ అందక కలిష మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని