రసాయన పరిశ్రమలో పేలిన బాయిలర్‌

మహారాష్ట్ర ఠాణెలోని ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. దాదాపు 60 మంది గాయపడ్డారు.

Published : 24 May 2024 03:21 IST

8 మంది దుర్మరణం.. 60 మందికి గాయాలు
మహారాష్ట్రలో దుర్ఘటన

ఠాణె: మహారాష్ట్ర ఠాణెలోని ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. దాదాపు 60 మంది గాయపడ్డారు. డోంబివిలి పరిధి ఎంఐడీసీ ఫేజ్‌-2లోని అముదాన్‌ పరిశ్రమను గత కొద్దినెలలుగా మూసివేసి ఉంచారు. ఇటీవలే పునఃప్రారంభించగా.. బాయిలర్‌ పేలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు మృతిచెందినట్లు.. వారంతా చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్నవారేనని అధికారులు తెలిపారు. ఈ పేలుడు ప్రభావంతో పరిసరాల్లోని ఇళ్లు దెబ్బతినడంతోపాటు కిలోమీటరు దూరం వరకూ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని