బాలికపై దాడి!

తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ బాలికను పోలీసులు ఆసుపత్రికి తరలించిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

Published : 24 May 2024 03:21 IST

గాయాలతో అపస్మారక స్థితికి..

ఎడపల్లి, న్యూస్‌టుడే: తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ బాలికను పోలీసులు ఆసుపత్రికి తరలించిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం జానకంపేట శివారులో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ గట్టుపై ఓ బాలిక (16) గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు బాధితురాలిని నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి తలపై తీవ్ర గాయాలున్నట్లు, మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కంటి పైభాగంలోని ఎముక విరిగిందని, బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన బాధితురాలు ఘటనాస్థలికి ఎలా వచ్చింది, ఎవరైనా దాడి చేశారా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. బాలిక స్పృహలో లేనందున ఘటనాస్థలి సమీపంలోని సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని