అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అచ్యుత్‌.. స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (ఎస్‌యూఎన్‌వై)లో చదువుతున్నాడు.

Published : 24 May 2024 03:22 IST

న్యూయార్క్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అచ్యుత్‌.. స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (ఎస్‌యూఎన్‌వై)లో చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం అతడు ఇక్కడ ద్విచక్రవాహన ప్రమాదంలో చనిపోయాడని భారత కాన్సులేట్‌ జనరల్‌ ‘ఎక్స్‌’లో తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి అతడి కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తామని చెప్పింది. అచ్యుత్‌ ఊరు, తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని