రోడ్డుపై గుంతతో కానిస్టేబుల్‌కు గాయాలు

బంధువుల్ని కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్‌ను గుంతల రూపంలో ఎదురైన ప్రమాదం ఆసుపత్రి పాలుజేసింది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ సాయిరామ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

Published : 25 May 2024 06:06 IST

అదే గుంత కారణంగా వరుస ప్రమాదాలు

ప్రమాదానికి కారణమైన గుంత

మోరంపూడి (దుగ్గిరాల), న్యూస్‌టుడే: బంధువుల్ని కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్‌ను గుంతల రూపంలో ఎదురైన ప్రమాదం ఆసుపత్రి పాలుజేసింది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ సాయిరామ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి పెట్రోల్‌ బంక్‌ దాటగానే రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో పడింది. దీంతో బైక్‌పై ఉన్న భార్య అరుణ, కుమారుడు బాలపవన్‌తో సహా సాయిరామ్‌ కిందపడ్డారు. కానిస్టేబుల్‌ ముఖానికి గాయాలయ్యాయి. కుమారుడి ముక్కుకి కూడా స్వల్పంగా గాయమైంది. రోడ్డుపై వెళ్లే వారు గమనించి వెంటనే 108కి సమాచారమిచ్చి, క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రహదారిపై ఉన్న గుంతను పూడ్చడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే ఆ గుంత కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగాయి. దానికి ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

108 వాహనంలో.. గాయపడిన కానిస్టేబుల్, ఆయన భార్య, కుమారుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని