కారును నడిపింది బాలుడే.. పుణె ప్రమాద ఘటనపై పోలీసుల వెల్లడి

మద్యం మత్తులో కారు నడిపి, ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడి(17) కేసుపై పోలీసులు స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును తన కుమారుడు నడపలేదని, డ్రైవింగ్‌ సీట్‌లో ఫ్యామిలీ డ్రైవర్‌ ఉన్నాడని బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ చెప్పడాన్ని వారు ఖండించారు.

Updated : 25 May 2024 06:06 IST

పుణె: మద్యం మత్తులో కారు నడిపి, ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడి(17) కేసుపై పోలీసులు స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును తన కుమారుడు నడపలేదని, డ్రైవింగ్‌ సీట్‌లో ఫ్యామిలీ డ్రైవర్‌ ఉన్నాడని బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ చెప్పడాన్ని వారు ఖండించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు పూర్తి అవగాహనతో ఉన్నాడని, డ్రైవింగ్‌ సీట్లో అతడే ఉన్నాడనేందుకు కచ్చితమైన ఆధారాలను సేకరించామని పుణె పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు. ఇంటి నుంచి కారును నిందితుడే బయటకు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందనీ, ఆ ఫుటేజీని తీసుకొని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు