హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం

హరియాణాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-దిల్లీ జాతీయ రహదారిపై మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు.

Published : 25 May 2024 06:04 IST

ఆరు నెలల చిన్నారి సహా ఏడుగురి మృతి
20 మందికి గాయాలు

అంబాలా: హరియాణాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-దిల్లీ జాతీయ రహదారిపై మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు. 20మంది గాయపడ్డారు. 30 మంది బంధువులతో కూడిన మినీ బస్సు గురువారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి జమ్ము-కశ్మీర్‌లోని వైష్ణోదేవి మందిరానికి బయలుదేరింది. హరియాణాలోని మోహ్రా గ్రామం సమీపంలో బస్సు ట్రక్కును బలంగా ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని