ఇరుకు వీధిలో రివర్స్‌ చేస్తూ.. వృద్ధుడిపైకి కారు ఎక్కించి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఇరుకు వీధిలో ఓ వ్యక్తి తన కారును రివర్స్‌ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించేశాడు. చక్రాల కింద మనిషి నలుగుతున్న విషయాన్ని కూడా గమనించకుండా రెండు సార్లు ముందుకు వెనక్కి వాహనాన్ని పోనిచ్చాడు.

Published : 25 May 2024 06:05 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఇరుకు వీధిలో ఓ వ్యక్తి తన కారును రివర్స్‌ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించేశాడు. చక్రాల కింద మనిషి నలుగుతున్న విషయాన్ని కూడా గమనించకుండా రెండు సార్లు ముందుకు వెనక్కి వాహనాన్ని పోనిచ్చాడు. ఝాన్సీలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరుకుగా ఉన్న గల్లీలో అప్పటికే రెండు వాహనాలను ఇరువైపులా నిలిపి ఉంచగా వాటి మధ్యలోంచి ఓ వ్యక్తి తన కారును రివర్స్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో రాజేంద్ర గుప్తా అనే 70 ఏళ్ల వృద్ధుడు అటుగా వెళ్తున్నాడు. ఇది గమనించని డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కి పోనిస్తూ వృద్ధుడిని ఢీకొట్టాడు. దీంతో అతడు కింద పడిపోయాడు. చక్రాల కింద మనిషి ఉన్న విషయాన్ని గుర్తించకుండా అతడిని కొంతదూరం డ్రైవర్‌ అలాగే ఈడ్చుకెళ్లాడు. మళ్లీ కారును ముందుకు నడిపి మరోసారి వృద్ధుడిపైకి ఎక్కించాడు. రాజేంద్ర గుప్తా అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన అతడిని బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు