కదులుతున్న ట్రక్కు నుంచి దారిదోపిడీ

ఆగిన రైలు కిటికీలోంచి గొలుసు లాక్కోవడం, నిలిపి ఉంచిన కారు అద్దాలు పగలగొట్టి డబ్బు దోచుకెళ్లడం వంటివి అప్పుడప్పుడూ చూస్తునే ఉంటాం.

Published : 26 May 2024 03:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆగిన రైలు కిటికీలోంచి గొలుసు లాక్కోవడం, నిలిపి ఉంచిన కారు అద్దాలు పగలగొట్టి డబ్బు దోచుకెళ్లడం వంటివి అప్పుడప్పుడూ చూస్తునే ఉంటాం. కానీ కదులుతున్న ట్రక్కు నుంచి సామాన్లు తస్కరించి.. ఆపై సినీఫక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రా- ముంబయి జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ట్రక్కుపై నుంచి ఇద్దరు వ్యక్తులు ఓ మూటను తొలుత రహదారిపై జారవేయడం వీడియోలో కనిపించింది. ఆపై ఆ వెనకే ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రాగా.. వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచే ప్రమాదకరంగా బైక్‌పై దిగడం గగుర్పాటుకు గురిచేస్తోంది. అటుగా వెళుతున్న వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ధూమ్‌’ మూవీలో చూపించిన దోపిడీ సీన్లూ దిగదుడుపే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని