నీటి ప్రవాహంలోకి దూసుకెళ్లిన కారు

తెలియని ప్రాంతం... రాత్రిపూట ప్రయాణం... పైగా భారీ వర్షం కురుస్తుండగా కారులో వెళుతున్న ఓ పర్యాటక బృందం నీటి ప్రవాహంలో మునిగిపోయింది.

Published : 26 May 2024 03:12 IST

కేరళలో ప్రమాదం.. సురక్షితంగా బయటపడిన హైదరాబాద్‌ వాసులు

కొట్టాయం: తెలియని ప్రాంతం... రాత్రిపూట ప్రయాణం... పైగా భారీ వర్షం కురుస్తుండగా కారులో వెళుతున్న ఓ పర్యాటక బృందం నీటి ప్రవాహంలో మునిగిపోయింది. స్థానికులు, పోలీసులు వారిని రక్షించారు. శుక్రవారం రాత్రి కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యాటకులు కేరళకు వెళ్లారు. ఆ ప్రాంతం కొత్త కావడంతో గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో అలప్పుజ మార్గంలో వెళ్తున్నారు. రాత్రిపూట కావడం..భారీ వర్షం కురుస్తుండడంతో మార్గం కనిపించలేదు. దీంతో కురుప్పంతర సమీపంలో వారి కారు నేరుగా నీటి ప్రవాహంలోకి దూసుకెళ్లింది. కారు మునిగిపోతుండటాన్ని గమనించిన స్థానికులు, పెట్రోలింగ్‌ పోలీసులు... ఒక మహిళతో సహా నలుగురు పర్యాటకులను కాపాడారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని