ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో శనివారం రెండుచోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

Published : 26 May 2024 03:15 IST

బీజాపుర్‌ జిల్లాలో 33 మంది లొంగుబాటు

పోలీస్‌ అధికారుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో శనివారం రెండుచోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా బెల్‌పొచ్చా, జిన్‌టాంగ్, ఉసకవాయ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా ఉదయం 6 గంటల సమయంలో వారిని గమనించిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. 2 గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. 

  • బీజాపుర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి జంపే మరక, కంకనార్‌ అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపుర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ సీతాపూర్‌ వద్ద కొంతమంది మావోయిస్టులు రహదారిపై కందకాలు తవ్వారు. ఆదివారం బంద్‌ను విజయవంతం చేయాలని కరపత్రాలను వదిలారు.
  • బీజాపుర్‌ జిల్లాలో 33మంది కీలక మావోయిస్టు నాయకులు ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్, సీఆర్పీఎఫ్‌ అధికారుల ఎదుట శనివారం లొంగిపోయారు. వీరిలో కీలక నాయకులు రాజు హేమ్లా, సుద్రు పూనెం, సుఖ్‌రామ్‌ మడవి, సురేశ్‌ కుంజం, ఐతూ పూనెం ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒక్కొక్కరిపై రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రివార్డు ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు