దేహ్రాదూన్‌లో గుప్తా సోదరుల అరెస్ట్‌

బిల్డర్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలపై దక్షిణాఫ్రికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారవేత్తలు గుప్తా సోదరులను ఉత్తరాఖండ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Published : 26 May 2024 04:37 IST

బిల్డర్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపణ

దేహ్రాదూన్‌: బిల్డర్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలపై దక్షిణాఫ్రికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారవేత్తలు గుప్తా సోదరులను ఉత్తరాఖండ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక బిల్డర్‌ సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ బాబా సాహ్ని శుక్రవారం తన కుమార్తె నివాస భవనం ఎనిమిదో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సాహ్ని కుమారుడు రణవీర్‌సింగ్‌ ఫిర్యాదు, ఘటనా స్థలంలో దొరికిన ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు గుప్తా సోదరులపై కేసు నమోదుచేశారు. అనంతరం అనిల్‌ గుప్తా, అజయ్‌ గుప్తాలను అరెస్టుచేశారు. శనివారం వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల జుడిషియల్‌ కస్టడీ విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని