గన్‌పౌడర్‌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరి మృతి...ఆరుగురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెమెతరా జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. పిర్దా గ్రామ పరిధిలోని  గన్‌ పౌడర్‌ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించడం వల్ల ఒకరు మరణించారు.

Published : 26 May 2024 04:37 IST

 బెమెతరా: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెమెతరా జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. పిర్దా గ్రామ పరిధిలోని  గన్‌ పౌడర్‌ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించడం వల్ల ఒకరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పలువురి ఆచూకీ లభించడంలేదు. మృతుల సంఖ్య పెరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులను రాయ్‌పుర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్‌ రణబీర్‌ శర్మ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సహాయక పనులు కొనసాగుతున్నాయి. పేలుడు తీవ్రత వల్ల ఘటనా స్థలంలో 40 అడుగుల లోతు గోయి ఏర్పడింది. రెండంతస్తుల భవనం కుప్పకూలింది. అక్కడ పని చేసే కార్మికులు శిథిలాల్లో చిక్కుకుపోయారని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. విచారణకు ఆదేశించినట్లు ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం అరుణ్‌ సావో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని