పుణె కారు ప్రమాద ఘటనలో డ్రైవర్‌ను ఇరికించే కుట్ర

ఓ మైనర్‌ దురుసు డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతిచెందిన ఘటనలో నిందితుడి తాతను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Published : 26 May 2024 04:38 IST

నిందితుడి తాత అరెస్టు

పుణె: ఓ మైనర్‌ దురుసు డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతిచెందిన ఘటనలో నిందితుడి తాతను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నేరాన్ని తమ ఫ్యామిలీ డ్రైవర్‌పై మోపేందుకు నిందితుడి తండ్రి, తాత ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్‌ అంగీకరించేందుకు  డ్రైవర్‌ కుటుంబానికి వారు పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాత ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజీ, డీవీఆర్‌(డిజిటల్‌ వీడియో రికార్డర్‌)ను స్వాధీనం చేసుకున్నామని, ఫుటేజీ ట్యాంపరింగ్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు అతడికి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని